సూర్యాపేటలో ‘ఎల్ ఎస్ బేకర్స్’ సీజ్
సూర్యాపేట: స్థానిక డీమార్ట్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ 'ఎల్ ఎస్ బేకర్స్' (LS Bakers) ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఈ బేకరీలో నాణ్యత లేని, బూజు పట్టిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారంటూ ఒక వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన అధికారులు: కస్టమర్ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, మున్సిపల్ ఎస్.ఐ యాదగిరి, మరియు శివ రామ్ ప్రసాద్ బృందం బేకరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సమయంలో బేకరీ వంటగదిలో తీవ్రమైన అపరిశుభ్రత వాతావరణం కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను నిల్వ ఉంచడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల...