పాఠశాలల్లో అల్పాహార పథకం.. డిసెంబర్ 9 నుంచి అమలు

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబర్ 30లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందాలు కుదిరాయి. నాగర్‌కర్నూల్‌లో కిచెన్ ఏర్పాటుకు జున్నా సోలార్ సిస్టమ్స్ రూ.5.17 కోట్లను, వికారాబాద్‌లో కిచెన్ కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా రూ.4 కోట్లను అందించాయి. విద్యార్థులకు అందించే ఆహారంలో కేలరీలను లెక్కించేందుకు ప్రత్యేక యాప్‌లను వినియోగించాలని సీఎం సూచించారు. స్థానిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మెనూను రూపొందించాలని, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం...