టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్‌కు హరీశ్ రావు లేఖ

టీజీ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగుగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో ఏర్పాటైన టీజీ ట్రాన్స్‌కో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కీలకమైన సంస్థ అని హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. ట్రాన్స్‌కోలో ప్రైవేట్ వాటాలకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో టీజీ జెన్‌కో, సింగరేణి, డిస్కమ్‌లపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్‌కో వాటాల విక్రయ ప్రతిపాదన కాంగ్రెస్ జాతీయ విధానాలకు విరుద్ధంగా ఉందని హరీశ్ రావు ఆరోపించారు....