పారిశ్రామిక రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది
తెలంగాణ పారిశ్రామిక రంగం ఉత్పత్తి, ఉపాధి, లాభదాయకతలో జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి సాధించినట్లు జాతీయ పారిశ్రామిక వార్షిక నివేదిక-2024-25 వెల్లడించింది. రాష్ట్రంలోని 13,937 కర్మాగారాల్లో దాదాపు 9.87 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది కాలంలోనే పారిశ్రామిక సంస్థల్లో కొత్తగా 75,374 మందికి ఉద్యోగాలు లభించాయి. కర్మాగారాల సంఖ్యలో తెలంగాణ 5.22 శాతం వాటాతో దేశంలో ఏడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో రూ.3.62 లక్షల కోట్ల పెట్టుబడితో రూ.4.57 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించినట్లు నివేదిక తెలిపింది. పరిశ్రమల ఉత్పత్తి విలువ రూపాయికి రూ.1.26గా ఉండగా.. జాతీయ సగటు రూ.1.19గా ఉంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ లాభదాయకత 8.92...