డీకాఫ్ కాఫీతో మెమరీ.. కెఫిన్ కాఫీతో చురుకుదనం!
కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి ఆసక్తికరమైన విషయాన్ని ఐర్లాండ్ పరిశోధకులు వెల్లడించారు. కెఫిన్ ఉన్న కాఫీ, డీకాఫ్ కాఫీ రెండూ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు. అయితే రెండు రకాల కాఫీలు మెదడుపై ఒకే విధమైన ప్రభావం చూపలేదని పరిశోధకులు చెబుతున్నారు. డీకాఫ్తో జ్ఞాపకశక్తి మెరుగుదల యూనివర్సిటీ కాలేజ్ కార్క్కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే 62 మందిని పరిశీలించారు. ముందుగా రెండు వారాల పాటు వారికి కాఫీ ఇవ్వకుండా ఉంచారు. అనంతరం ఒక బృందానికి కెఫిన్ కాఫీ, మరో బృందానికి డీకాఫ్ కాఫీ అందించారు. డీకాఫ్ కాఫీ తీసుకున్న...