యిలసింగవరం గ్రామంలో వరి పొలాలను పరిశీలించిన ఏఈఓ అన్వేష్
అనంతగిరి, అక్టోబర్ 3 (ఆర్యాద్వి):అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో త్రిపురవరం క్లస్టర్ ఏఈఓ అన్వేష్ వరి పొలాలను పరిశీలించి, రైతులకు తగు సలహాలు సూచనలు అందించారు.వానాకాలం వరి పంటలలో ఉదృతమయ్యే ఆకు నల్లి నివారణకు ఎకరాకు ప్రొఫినొఫాస్ 400 మీ.లీ లేదా స్పిరోమెసిఫెన్ 200 మీ.లీ లేదా ప్రొపెర్గేట్ 400 మీ.లీ చొప్పున పిచికారి చేయాలని మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణకు కాఫర్ హైడ్రాక్సెడ్ ఎకరానికి 400 గ్రాములు లేదా ప్లాంటామైసిన్ ఎకరానికి 80 గ్రాములు, సుడి దోమ ఉదృతి కనిపిస్తే వాటి నివారణకు ఎకరానికి ఎసిపేట్ 300 గ్రాములు లేదా బుఫ్రోఫెజిన్ 320 మీ.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు....