పాలనలో సమన్వయ లోపం

-ఆర్ధిక విషయంలో మంత్రులకు లేని స్వేచ్ఛ -ముఖ్యమంత్రి రేవంత్ తీరు బాగున్నా ఎంపికలో పొరపాట్లు -చట్టం అవినీతి పరులకు చుట్టమవుతుంది. -ఉద్యమాలకు యువతరమే పునాది -ఓటు తొలగింపు నేరమే -మీట్ ద ప్రెస్లో కూనంనేని ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 3 : ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సమన్వయం లోపించిందని అది ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు బాగున్నా అనేక అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఎంపికలో పొరపాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని పునాదిగా నిలిచిన ఓటు హక్కును తొలగించడం నేరమేనని ఆయన స్పష్టం...