జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మరియు పక్కగృహాలు మంజూరు చేయాలి.
టీయూడబ్ల్యూజే (ఐజెయు) భద్రాచలం డివిజన్ & పట్టణ కమిటీల డిమాండ్స్, భద్రాచలం: అక్టోబర్, 3 :జర్నలిస్టులపై దాడులు, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నేడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ (IJU) యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భద్రాచలం డివిజన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బి.వి. రమణ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమల గిరి ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు....