రోడ్డు ప్రమాదంలో యువకుడి తలకు తీవ్రమైన గాయాలు
అత్యవసర మెదడు శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలు నిలబెట్టిన "మలక్ పేట్ యశోదా వైద్యులు" రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడడంలో సత్వర స్పందన, అధునాతన వైద్యం అత్యంత కీలకం ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 3: ఖమ్మం, అక్టోబర్ 3: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెదడులో రక్తస్రావం, వాపుతో పాటు మాస్ ఎఫెక్ట్, మిడ్లైన్ షిఫ్ట్ ఏర్పడిన 29 ఏళ్ల యువకుడికి తొలుత డీకంప్రెసివ్ క్రానియెక్టమీ నిర్వహించి, ఆ సమయంలో తొలగించిన పుర్రె ఎముక భాగాన్ని పొత్తికడుపు ముందు భాగంలో భద్రపరిచి, రోగి కోలుకున్న అనంతరం దానిని తిరిగి అమర్చి మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా క్రానియోప్లాస్టీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా అశ్వాపురానికి చెందిన...