ఆర్టీఏలో పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవు.. 7 పనిదినాల్లో ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ

వాహనదారులు కార్డులు రాకపోతే సమీప పోస్టాఫీసును సంప్రదించాలి.. వాహనాల అమ్మకం తర్వాత యాజమాన్య బదిలీ తప్పనిసరి: జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ మహబూబాబాద్ ప్రతినిధి: అక్టోబర్, 3: మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. "స్పీడీ డిస్పోజ్, ఎర్లీ డిస్పాచ్" (త్వరిత పరిష్కారం.. ముందస్తు పంపిణీ) అనే నినాదంతో కార్యాలయంలోని ప్రతి సేవకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడు పనిదినాల్లో ఆర్సీ, డీఎల్ కార్డులు చాలామంది వాహన యజమానులు తమకు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు అందలేదని కార్యాలయానికి వస్తున్నారని...