కోదాడలో రోడ్డు ఎవరిది..? మాల్ది ఎలా అయింది?
నిబంధనలు సామాన్యులకేనా..? అధికారుల మౌనం ఎందుకు? కోదాడ, అక్టోబర్ 04 (ఆర్యాద్వి): అభివృద్ధి పేరుతో పెద్ద షాపింగ్ మాల్లు రావడం స్వాగతించాల్సిన విషయమే. కానీ ప్రజలు నిత్యం వినియోగించే రహదారులపై ఏర్పాట్లు చేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ప్రశ్నించాల్సిందే. కోదాడలోని చెన్నై షాపింగ్ మాల్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన రహదారిపై బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేయడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే రహదారిపై ఇలాంటి ఏర్పాట్లకు ఎవరి అనుమతి ఉంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రోడ్డు హద్దులు ఎక్కడ? మాల్కు సంబంధించిన పార్కింగ్, ప్రవేశ మార్గాలు,...