కోదాడలో దారుణం.. వృద్ధురాలిని మోసం చేసి అర ఎకరం కాజేత!

ఆధార్ అప్డేట్ అంటూ వేలిముద్ర తీసుకుని పొలం రిజిస్ట్రేషన్ కోదాడ, అక్టోబర్ 4(ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మానవత్వం మరచిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ నమ్మించి, ఓ వృద్ధురాలి నుండి అర ఎకరం పొలాన్ని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన కుక్కడపు రాములమ్మ అనే వృద్ధురాలికి అర ఎకరం పొలం ఉంది. ఆమె మనమరాలు అనంతుల వినీత కుటుంబ సభ్యులు రాములమ్మ వద్దకు వచ్చి "నీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి, తహసీల్దార్ ఆఫీస్ కు రా" అని నమ్మబలికారు. అమాయకత్వంతో వారిని నమ్మిన...