సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు
•పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటి విడుదల •మంత్రి తుమ్మల వెల్లడి •లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు విద్యుత్ సరఫరా •రైతులు ఆందోళన చెందొద్దు.. •నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక చర్యలు ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్: 5:తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని చెప్పారు. పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్...