2029 నాటికి 4-స్టార్.. ప్రభుత్వ స్కూళ్లపై మంత్రి లోకేశ్ సమీక్ష!
ఏడాదిలో వన్-స్టార్ నుంచి టూ-స్టార్.. వెయ్యి స్కూళ్లకు 5-స్టార్ లక్ష్యం అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు లక్ష్యాలను నిర్దేశించారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కనీసం 4-స్టార్ ప్రమాణాలకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. వన్, జీరో-స్టార్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం వన్-స్టార్ స్థాయిలో ఉన్న పాఠశాలలను ఏడాదిలోపు టూ-స్టార్ స్థాయికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. జీరో-స్టార్ పాఠశాలలను ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం వన్-స్టార్ స్థాయికి చేర్చేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కనీసం...