‘మా అనుమతి లేదు’.. ఫారమ్‌-6పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారమ్‌-6లో చేసిన మార్పులపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఫారమ్‌-6లో సవరించిన ఏ రూపానికీ తాము అనుమతి ఇవ్వలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు మార్పులు ఎవరు చేశారు? ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో భాగంగా ఫారమ్‌-6కు అదనపు ప్రకటనను జత చేసిన అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందన్న వాదన నేపథ్యంలో ధర్మాసనం రికార్డులను పరిశీలించి, మార్పులు ఎవరి ద్వారా జరిగాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. కొత్త ఫారమ్‌లో ఏం మారింది? కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వ్యక్తి.....