రాజకీయాలను దిగజారుస్తున్న బజారు భాష

-సమస్యల మళ్లింపుకే ఆస్తుల ఆరోపణలు -ప్రజల పాత్ర లేని దిశగా ప్రజాస్వామ్యం -ఐక్య కార్యాచరణ తర్వాతే ఐక్యత -అధికారం ఉన్నప్పుడు భూములు పంచేందుకు జంకేందుకు...? -ఐజెయు మీట్ ద ప్రెస్లోలో సిపిఎం నేత తమ్మినేని ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 5: ఖమ్మం: రాష్ట్రంలో అధికార, విపక్ష నేతలు వాడుతున్న బజారు భాష రాష్ట్ర రాజకీయాలను దిగజారుస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గౌరవనీయ భాష ప్రయోగించకుండా నీచ పదజాలం రాజకీయాల్లో సరైంది కాదని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించుకే భూ కబ్జాలు, ఆక్రమణల వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం టియుడబ్ల్యూజె (ఐజేయు) ఆధ్వర్యంలో...