విష జ్వరాల విజృంభణతో పడకేసిన పల్లెలు
ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి పంచాయతీలలో పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలి కొండబోయిన నాగేశ్వరరావు కారేపల్లి, అక్టోబర్ 5: డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభించడంతో పల్లెలు పడకేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విష జ్వరాల నివారణకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని పంచాయతీల్లో మురికి కాలువలు బాగు చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణ మందు పిచికారి చేసి పారిశుద్ధ్య పై దృష్టి పెట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం షేక్ బందే అలీ అధ్యక్షతన కారేపల్లి లో జరిగిన సిపిఎం గ్రామ...