ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి
- ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్ పిలుపు - గిరిజన సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 5: సోమవారం,బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్ ఆర్ శ్రీరాం నాయక్, భూక్యా వీరభద్రం, ఎం బాలు నాయక్,వాంక్డోత్ వీరన్న,అశోక్ లతో కలిసి డా.రామచంద్రు నాయక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు...