గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతూ.. మునగాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ డ్రామాలా?

- మంత్రి ఉత్తమ్ పై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్ కోదాడ, అక్టోబర్ 5 ( ఆర్యాద్వి): మునగాల మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న హంగులు, ఆర్భాటాలు చూస్తుంటే ముచ్చటేస్తోందని, దేశంలోనే అతిపెద్ద సెంట్రలైజ్డ్ కిచెన్ తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని కోదాడ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. ఆదివారం కోదాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "మునగాలలో కొత్త కిచెన్ ముచ్చట పక్కన పెడితే, ప్రస్తుతం రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి ఏంటి? పేద పిల్లలకు మూడు పూటలా నాణ్యమైన, సురక్షితమైన అన్నం పెట్టలేని నీచమైన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం...