ముగిసిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సుదీర్ఘ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన రాజకీయ, పరిపాలనాంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక పోరు కావడంతో, క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు, సమన్వయంపై ఇద్దరు నేతలూ ప్రధానంగా దృష్టి సారించారు. స్థానాల సర్దుబాటుపై క్లారిటీ! రాజకీయ వర్గాల నుంచి...