జగన్ను విమర్శించడానికే ఆ సభ పెట్టారు: కూటమి ప్రభుత్వంపై రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతల మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదిరాయి. వైఎస్ఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధికారిక సభలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వై. రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి, కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ప్రభుత్వం ప్రజాధనంతో ఈ సభలను ఏర్పాటు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి నాలుగు నెలల పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి శూన్యం.. విమర్శలే ధ్యేయం! "రాష్ట్రంలో కూటమి...