అనంతగిరిలో రూ.14.98 కోట్లతో భారీ గోదాముల నిర్మాణం
శాంతినగర్ లో భూమిపూజ చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అనంతగిరి, అక్టోబర్ 5 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ లో రూ.14.98 కోట్ల వ్యయంతో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న భారీ గోదాముల నిర్మాణానికి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఆదివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. "రూ.14.98 కోట్లతో 15 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణం...