స్పేస్లోకి విస్కీ.. 2028లో ‘స్పేస్ పఫిన్’ చారిత్రాత్మక ప్రయోగానికి శాస్త్రవేత్తల గ్రీన్ సిగ్నల్!
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. విస్కీ ప్రియులతో పాటు సైన్స్ ప్రపంచాన్ని ఆకర్షించేలా 2028లో శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ‘స్పేస్ పఫిన్’ (Space Puffin) అని పిలిచే ఈ మిషన్ ద్వారా విస్కీ నమూనాలను మరియు దాని తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను భూమి కక్ష్యలోకి పంపించి ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు. అంతరిక్షంలో ఉండే శూన్య గురుత్వాకర్షణ (Zero Gravity) మరియు తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు... విస్కీ యొక్క రుచి, రంగు, మరియు రసాయన గుణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడమే ఈ పరిశోధన యొక్క ప్రధాన లక్ష్యం. ఐదేళ్ల పాటు నిఘా.. క్యూబ్శాట్ ద్వారా పరిశోధన! ప్రస్తుత ప్రణాళికల ప్రకారం,...