రాజకీయాల్లోకి ధనుష్.. కొత్త పార్టీపై జోరుగా ప్రచారం!
చెన్నై: తమిళ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారంటూ తాజాగా పలు కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును నమోదు చేసినట్లు కూడా సమాచారం ప్రచారంలోకి వచ్చింది. అభిమాన సంఘాల కార్యకలాపాలతో పెరిగిన ఆసక్తి గత కొంతకాలంగా ధనుష్ అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నాయి. రక్తదాన శిబిరాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త సభ్యులను చేర్చుకోవడం, నియోజకవర్గాల స్థాయిలో అభిమాన సంఘాలను బలోపేతం చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయి. దీంతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. ఇటీవల అభిమానులతో మాట్లాడుతూ సినిమా...