ERC పేరుతో రూ.5,400 కోట్ల విద్యుత్ భారం - ప్రజల నెత్తిన కాంగ్రెస్ బండ!
బిల్లు కట్టలేక సచివాలయంలోనే మంచినీళ్లు బంద్ - మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్ కోదాడ, అక్టోబర్ 7 (ఆర్యాద్వి ): ట్రూయప్ (True-Up) పేరుతో ERC ద్వారా రూ.5,400 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కోదాడ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోదాడలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే, కాంగ్రెస్ మంత్రులు దుబారా ఖర్చులతో హెలికాప్టర్లలో గాల్లో చక్కర్లు కొడుతూ, విందులు, విహార యాత్రలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు....