రాహుల్, ప్రియాంక అరెస్ట్.. బలవంతంగా వాహనం ఎక్కించిన పోలీసులు
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన నేతలు జంతర్ మంతర్ వైపు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీల బస్సులను పోలీసులు అడ్డుకోవడంతో నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రియాంక గాంధీ ఇతర మహిళా నేతలతో కలిసి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. బలవంతంగా వాహనాల్లోకి నిరసన కొనసాగుతుండగా పోలీసులు రాహుల్ గాంధీని భుజాలపై మోసుకెళ్లి పోలీసు బస్సులో ఎక్కించారు. అనంతరం మహిళా పోలీసులు ప్రియాంక గాంధీతో పాటు ఇతర మహిళా నేతలను...