ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్

ముంబై: ఫిక్స్డ్ డిపాజిట్‌ (FD) ఖాతాదారులకు బజాజ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ కాలపరిమితుల FDలపై వడ్డీ రేట్లను 15 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 7, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త డిపాజిట్లతో పాటు రెన్యూవల్ చేసే FDలకు కూడా ఇవి వర్తిస్తాయి. గరిష్ఠంగా 7.75 శాతం సాధారణ ఖాతాదారులకు 12–17 నెలల FDపై వడ్డీని 6.60 శాతం నుంచి 6.80 శాతానికి పెంచారు. 18–30 నెలలకు 6.85 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 31–60 నెలల కాలానికి గతంలో 7.40 శాతంగా ఉండగా ఇప్పుడు 7.75 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్లకు 8.15...