మున్సిపోల్స్‌పై జగన్ స్పీడ్.. తొలి అభ్యర్థి ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే పార్టీ తరఫున తొలి మేయర్ అభ్యర్థిని ప్రకటించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. నెల్లూరు నుంచి తొలి ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ ఇప్పటికే పార్టీ నేతలను ఆదేశించారు. సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో బలమైన, విశ్వసనీయమైన అభ్యర్థులను గుర్తించి ముందుగానే కసరత్తు చేయాలని సూచించారు. తాజాగా నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించడం ద్వారా వైసీపీ ఎన్నికల కసరత్తులో తొలి...