అందాల పోటీలో విజేతగా నిలిచిన ఖమ్మం యువతి కోపూరి అలేఖ్య..
ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్ 7: ఖమ్మం : ఢిల్లీలోని ద్వారక , సెక్టార్ 21లో ఉన్న వివాంటా హోటల్లో డికె పేజెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే లో ఖమ్మం మమతా రోడ్డు ప్రాంతానికి చెందిన కోపూరి అలేఖ్య పాల్గొని ప్రైడ్ మిసెస్ తెలంగాణ 2026 (జి - 2) కేటగిరిలో విజేతగా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు . ఈ కార్యక్రమంలో మిస్టర్ , మిస్ , మిస్ టీన్ మరియు మిసెస్ విభాగాల నుండి పోటీదారులు ఒకచోట చేరి , తమ ప్రతిభ , ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు . డికె పేజెంట్ ఆర్గనైజేషన్...