జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ... ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

• అందుకు మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి • వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలు కోసం జేఏసీ ఏర్పాటు • డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ ప్రత్యేక దృష్టి • కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు ఏఐపై పట్టు సాధించాలి • వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 7: ఖమ్మం: జర్నలిస్టుల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిపి హైదారాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు రాష్ట్ర పౌర సంబంధాల శాఖా...