ఇందిరమ్మ ఇండ్లతో వెలుగుమట్ల పేదల సొంతింటి కల సాకారం... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి నవంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో ఇండ్ల నిర్మాణాలు, మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలి లబ్ధిదారులకు సకాలంలో నిర్మాణం బిల్లుల చెల్లింపు వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 7: పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. బుధవారం ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్...