షేర్ మార్కెట్‌కు భారీ షాక్.. 1,045 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు (1.44 శాతం) పతనమై 71,593.24 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 371.25 పాయింట్లు (1.64 శాతం) కోల్పోయి 22,231.80 వద్ద ముగిసింది. ఎందుకు పడిపోయాయి? ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడంతో పాటు, విధాన వైఖరిని ‘క్యాలిబ్రేటెడ్ టైటెనింగ్’గా మార్చడం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న బాండ్‌ యీల్డ్స్, భారీగా పెరిగిన ముడి చమురు ధరలు, రూపాయి బలహీనత కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) వరుస అమ్మకాలు మార్కెట్...