ఎఫ్డీనా.. చిన్న పొదుపు పథకాలా? పెట్టుబడికి ముందు ఇవి చూడండి
పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేటుతో పాటు భద్రత, పన్ను భారం, పెట్టుబడి పరిమితి, డబ్బు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), పీపీఎఫ్, ఇతర చిన్న పొదుపు పథకాలకు వాటి సొంత ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. ఎఫ్డీల్లో సౌలభ్యం బ్యాంకు ఎఫ్డీల్లో మన అవసరానికి అనుగుణంగా వివిధ కాలపరిమితులను ఎంచుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే డిపాజిట్ను ఉపసంహరించుకునే అవకాశం సాధారణంగా ఉంటుంది. అయితే వడ్డీ ఆదాయంపై పన్ను భారం ఉండొచ్చు. అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే సమయంలో బ్యాంకు డిపాజిట్ బీమా పరిమితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పీపీఎఫ్లో దీర్ఘకాలిక పెట్టుబడి పబ్లిక్...