సూపర్ ఎల్నినో ముప్పు.. ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఎల్నినో మరింత బలపడుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం, ఈ ఎల్నినో 2026 చివర్లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అసాధారణంగా ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసం 3.7 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని WMO అంచనా వేసింది. ఇది గతంలో నమోదైన బలమైన ఎల్నినో స్థాయులను మించే అవకాశం ఉంది. ఫిబ్రవరి వరకు ప్రభావం ఎల్నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు...