“ఒక్కసారి ఆలోచిస్తే.. సైబర్‌ మోసాలకు చెక్‌ !” : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్: 8 : “ఒక్కసారి ఆలోచిస్తే.. సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. జాతీయ సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాలలో భాగంగా భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్‌ భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ మాసంలో నిర్వహిస్తున్న “పాజ్ ఫర్ సేఫ్టీ – థింక్ - వెరిఫై…” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాలు వివిధ రూపాల్లో...