యాసంగిలో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి.....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
సూపర్ ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం.. గణనీయంగా తగ్గిన భూగర్భ జలాలు ప్రాజెక్టులు, చెరువుల్లో పరిమిత నీటి నిల్వలు.. త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి కాలువల ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదలకు అవకాశం లేదు వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి బోరుబావుల్లోనూ తగ్గిన నీటి లభ్యత.. నీటి పొదుపు పద్ధతులు పాటించాలి ఖమ్మం, అక్టోబర్-08 యాసంగి సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, అధిక నీటి అవసరమయ్యే వరి వంటి పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్...