జ్ఞానేష్కుమార్ రాజీనామా చేయాల్సిందే
-ఖమ్మంలో నినదించిన ఇండియా కూటమి -పెద్ద సంఖ్యలో పాల్గొన్న వామపక్ష, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, విద్యార్థి, యువజనులు -సిసిఏ సంపూర్ణ మద్దతు ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్: 8: ఖమ్మం : ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్కుమార్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు నినదించాయి. తప్పుడు మార్గంలో ఎన్నికలు నిర్వహిస్తున్న పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గురువారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి మయూరిసెంటర్ పాత బస్టాండ్ మీదుగా జెడ్పి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) మాస్న్, సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు....