రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఎక్కడిది?
మాటల్లో 24 గంటలు.. క్షేత్రస్థాయిలో విద్యుత్ కోతలా? అధికారంలోకి రావడానికి 24 గంటల కరెంటు హామీలు... గద్దెనెక్కిన తర్వాత రైతుకు మొండి చెయ్యి ప్రభుత్వ ప్రకటనలు ఒకలా.. రైతుల పరిస్థితి మరోలా! వ్యవసాయ విద్యుత్‌పై నిర్లక్ష్యం వీడాలి.. రైతులకు న్యాయం చేయాలి _ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ, అక్టోబర్ 08 ): వ్యవసాయ విద్యుత్ సరఫరాపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చిలుకూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌లను, విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించి నిరసన తెలిపారు.మండలంలోని అన్ని గ్రామాలకు రోజుకు ఎన్ని గంటల...