అనంతగిరి మండలం పాలవరం తండాలో తప్పిన పెను ప్రమాదం!

*తెగిపడిన 11 KV హైటెన్షన్ వైర్లు - 50 ఏళ్ల నాటి వైర్లతో ప్రజల ప్రాణాలకు ముప్పు* *అనంతగిరి, అక్టోబర్ 09 (ఆర్యాద్వి):* సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండా గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని జనావాసాల మీదుగా వెళ్తున్న 11 KV హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గత 50 సంవత్సరాల క్రితం వేసిన పాత వైర్లు కావడంతో తుప్పుపట్టి ఎప్పుడో పుటుక్కున తెగిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. *ఏళ్లుగా విన్నవించినా పట్టించుకోని అధికారులు* ఊరి మధ్య నుండి, ఇళ్లపై నుండి వెళ్తున్న 11...