ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం
అర్హులకు అన్యాయం – కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం కాగితాలకే పరిమితమైన నిబంధనలు కాంగ్రెసేతర సర్పంచులు, ఇందిరమ్మ కమిటీల జాబితాల బుట్టదాఖలు ప్రజల డబ్బుతో రాజకీయాలా? కాంగ్రెస్ కండువా కప్పితేనే ఇళ్లా? పారదర్శకత లోపించిన ఎంపిక విధానం పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అధికార దుర్వినియోగం పై న్యాయపోరాటం విలేకరుల సమావేశంలో సిపిఐ ( ఎం ) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేటాయింపుల్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం, రాజకీయ వివక్ష జరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్ర...