"చేగువేరా" ప్రపంచ విప్లవకారుడు..
-సిపిఎం నాయకులు కొండేబోయిన నాగేశ్వరరావు -కే నరేంద్ర. కారేపల్లి: అక్టోబర్ 9 యూత్ ఐకాన్, ప్రపంచ విప్లవకారుడు ఇయర్ నెక్స్ట్ చేగువేరా 59వ వర్ధంతిని సిపిఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎదుర్కోవడంలో ఓడించడంలో క్యూబాలో విప్లవం సాధించడంలోనూ ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన దానికి కారణం అమెరికన్ సామ్రాజ్యవాదం అని అంతర్జాతీయ వేదికలపై ఎండ కట్టడంలో కీలక భూమిక పోషించిన నిజమైన ప్రపంచ విప్లవకారుడు చేగువేరా అని కొనియాడారు. నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని మిత్రదేశాలు ప్రపంచం పై పెత్తనం చేయడం కోసం వనరులను దోచుకోవడం...