మొండితోగు జి పి వెంచర్ భూములను కొంటే గోడకేసిన సున్నమే తిరిగి రాదు. - ఇల్లందు ఎమ్మార్వో ఖాసీం.
ఇల్లందు ప్రతినిధి: అక్టోబర్, 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మొండితోగు గ్రామపంచాయతీ లోని సర్వేనెంబర్ 588/12/1/2, 588/12/1/3 భూములు కొంటే తిరుపతి హుండీలో వేసినట్లేనని, గోడకేసిన సున్నమేనని తిరిగి రావని ఇల్లెందు ఎమ్మార్వో ఖాసీం అన్నారు. ఇటీవల మొండితోగు గ్రామపంచాయతీ లోని 1/70 పరిధిలోని 9 ఎకరాల లొ ఎలాంటి లేఅవుట్, అనుమతులు లేకుండా కొందరు వెంచర్ వేసి ప్లాట్లు చేసి అమ్మ కానికి పెడుతున్నట్టు వస్తున్న వార్తల విషయమై ఇల్లందు ఎమ్మార్వో కాసిం ను" మీడియా ప్రతినిధి ఈ విషయమై వివరణ కోరగా మండలంలోని మొండితోగు గ్రామపంచాయతీ లోని తొమ్మిది ఎకరాల భూములు వెంచర్ చేసి అమ్మకాలు పెట్టిన విషయాన్ని ఆ...