సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9: సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా...