కాంట్రాక్ట్-ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా.. స్థానిక ఎన్నికలకు సెగ..!

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమా? - వైసీపీకి అస్త్రంగా మారిన ఉద్యమం *శ్రీకాకుళం, అక్టోబర్ 09 రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్-ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక ధర్నా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏం జరుగుతోంది? శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఎదుట గురువారం వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో దాదాపు 1500 మందికి పైగా పాల్గొన్నారు. "100% గ్రాస్ వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి, వెంటనే రెగ్యులరైజ్ చేయాలి" అంటూ పెద్ద...