మండలంలో 3 శాఖల నిర్లక్ష్యం - రైతులు, గ్రామస్తుల విలవిల!
అర్థరాత్రి కరెంటుతో రైతులకు నరకం, పట్టపగలు దొంగతనాలు, వాగులో ఇసుక దోపిడీ! అనంతగిరి , అక్టోబర్ 10(ఆర్యాద్వి): అనంతగిరి మండలం, కొత్తగూడెం గ్రామంలో నెలకొన్న సమస్యలపై రెవెన్యూ, పోలీస్, విద్యుత్ అధికారులు స్పందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. తమ గోడును తెలియజేస్తూ ఓ ఆడియోను విడుదల చేసి, ఆ ఆడియో ఒక్కసారి విని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కొత్తగూడెం గ్రామస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు: 1. అర్థరాత్రి కరెంటుతో రైతుల అవస్థలు: రైతులకు పగటిపూట కరెంటు ఇవ్వకుండా అర్థరాత్రి సమయంలో విద్యుత్ సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాములు, తేళ్ల భయంతో రాత్రి వేళ పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయలేక నరకం అనుభవిస్తున్నామని...