కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు _ కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట,అక్టోబర్ 10 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 2k రన్ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా పదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ గొప్పతనాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకానికి గుర్తుచేయడానికే...