రైతులకు శాపంగా కాంగ్రెస్ ప్రభుత్వం - కరెంట్ కోతలతో కన్నీరు
గొండ్రియాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి రైతుల వినూత్న నిరసన - ఎండిన పొలంలో బైకులతో ఆందోళన అనంతగిరి, అక్టోబర్ 10 (ఆర్యాద్వి): అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు కళ్లముందే ఎండిపోతుంటే చూస్తూ ఉండలేక రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి వినూత్న నిరసనకు దిగారు. "కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు చావే శరణ్యం" అంటూ నినాదాలు చేశారు. పెట్టుబడి నీళ్లపాలు - ఎండిన పొలాల్లో బైకులతో నిరసన: గొండ్రియాలలో రోజుకు 3-4 గంటలు కూడా కరెంటు సరిగా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజీతో మోటార్లు...