రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసినా వెనక్కి తగ్గేది లేదు
తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ భజన బృందానికి నాయకత్వం ప్రత్యేక టాస్క్ ఇచ్చిందని తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని తిడితే రూ.100, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే రూ.50, ఫేస్బుక్లో కామెంట్లు పెడితే రూ.500 చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ఎంత ఎక్కువగా విమర్శిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయనే విధంగా టాస్క్ ఇచ్చారని ఆరోపించారు. మీరు వేసిన ప్రతి రాయితో రేవంత్ రెడ్డి గోడ కడుతున్నారు అని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి తగిన సమాధానం చెబుతారని...