వాయిలసింగవరం గ్రామంలో వీబీజీరామ్జీ పధకం సామాజిక తనిఖీపై గ్రామసభ

గ్రామసభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు అనంతగిరి, అక్టోబర్ 10( ఆర్యాద్వి): అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో ఈరోజున వీబీజీరామ్జీ పధకం 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన పనులపై మరియు చేయాత పెన్షన్లపైసామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది ఈసందర్భంగా సామాజిక తనిఖీ డిఆర్పీ ముత్తయ్య తనిఖీ పై నివేదికను చదివి వినిపించారు మరియు గ్రామంలో ఆర్ధిక అక్షరాస్యత పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బ్యాంకింగ్ సేవల వినియోగం డిజిటల్ లావాదేవీలు పొదుపు యొక్క ప్రాముఖ్యత భీమా పధకాలు పెన్షన్ పథకాలు రుణాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైబర్ మోసాల నుండి రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు...