ఢిల్లీ అరెస్టులపై ప్రియాంకా ఫైర్.. ప్రభుత్వానికి భయం పట్టుకుందంటూ విమర్శ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యువత నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు నిరసనలు చేస్తున్న వారిపై ఆంక్షలు విధించడం సరికాదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న ఢిల్లీలో జరిగిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా...